టీఎస్ఆర్‌జేసీ సెట్ 2023 సిలబస్, పరీక్షా విధానం (TSRJC CET 2023 Exam Pattern) గురించి ఇక్కడ తెలుసుకోండి

Rudra Veni

Updated On: April 20, 2023 02:22 PM

జూనియర్ కాలేజీలలో మొదటి సంవత్సరం ఇంటర్‌లో విద్యార్థులకు ప్రవేశ కల్పించడానికి TSRJC CETని  నిర్వహించడం జరుగుతుంది. టీఎస్ఆర్‌జేసీ సెట్ 2023 సిలబస్,  పరీక్షా విధానానికి (TSRJC CET 2023 Exam Pattern) సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో తెలియజేశాం. 
టీఎస్ఆర్‌జేసీ సెట్ 2023 సిలబస్, పరీక్షా విధానం (TSRJC CET 2023 Exam Pattern) గురించి ఇక్కడ తెలుసుకోండి

టీఎస్ఆర్‌జేసీ సెట్ 2023 సిలబస్, పరీక్షా విధానం (TSRJC CET 2023 Exam Pattern): TSRJC CET 2023 సిలబస్  తెలంగాణ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (TSREIS) ద్వారా విడుదలైంది.  తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ని జూనియర్ కాలేజీలలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్‌లో విద్యార్థులకు ప్రవేశం కల్పించడానికి నిర్వహించబడుతుంది. ప్రిపరేషన్ ప్రారంభించే ముందు అభ్యర్థులు సిలబస్‌‌ని, పరీక్షా విధానం గురించి  చెక్ చేసుకోవాలి. అభ్యర్థులు ఇక్కడ TSRJC CET 2023 సిలబస్‌ని ఇక్కడ తెలుసుకోవచ్చు.

ఈ ఏడాది TSRJC CET  2023 పరీక్ష మే 06, 2023న జరగనుంది.  దీనికి సంబంధించిన హాల్ టికెట్ త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉంది. అడ్మిట్ కార్డుల క ోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ tsrjdc.cgg.gov.inని చూస్తుండాలి. TSRJC CET 2023 ప్రశ్నాపత్రంలో అన్ని మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్ష ఆఫ్‌లైన్ విధానంలో జరుగుతుంది. తెలుగు, ఇంగ్లీస్ మీడియంలో కూడా ఈ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది.  TSRJC CET 2023  పరీక్షా విధానం గురించి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో అందజేశాం.

టీఎస్ఆర్‌జేసీ సెట్ సిలబస్ 2023 (TSRJC CET 2023 Exam Pattern)

తెలంగాణ రెసిడెన్షియల్ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సిలబస్‌లో మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్ సబ్జెక్టులు ఉంటాయి. ఈ సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలే క్వశ్చన్ పేపర్‌లో వస్తాయి.
సబ్జెక్ట్ సిలబస్‌లో వివరాలు
మ్యాథ్స్ పొలినామినల్ (Polynomial)
స్టేటస్టిక్స్ (Statistics)
నిజమైన సంఖ్యలు (Real Number)
అర్థమెటిక్ ప్రోగ్రెషన్ (Arthmetic Progression)
ఫిజికల్ సైన్స్ వేడి, గతిశాస్త్రం
పరమాణు సంఖ్యలు
ఆమ్లాలు మరియు బేస్
బేస్ మరియు లవణాలు
పరమాణు ద్రవ్యరాశి
అణువు యొక్క నిర్మాణం
బయాలాజికల్ సైన్స్ పోషకాహారం
రవాణా
ప్రసరణ వ్యవస్థ శ్వాసకోశ వ్యవస్థ పునరుత్పత్తి వ్యవస్థ
న్యూరాన్లు మరియు నియంత్రణ వ్యవస్థ
సోషల్ స్టడీస్ అభివృద్ధి కోసం ఆలోచన
భారతదేశ వాతావరణం
భారతీయ సంస్కృతి
భారతదేశ వారసత్వం
ఉపాధి మరియు నిరుద్యోగం
తలసరి ఆదాయం
ఇంగ్లీష్ ఇంగ్లీష్ రీడింగ్ కాంప్రహెన్సియో (Reading Comprehension)
టెన్స్
లెటర్ రైటింగ్
గ్రామర్ పదజాలం
ప్రత్యక్ష, పరోక్ష ప్రసంగం
వాక్య సవరణ

TSRJC CET పరీక్షా విధానం 2023 (TSRJC CET EXAM PATTERN 2023)

తెలంగాణ రెసిడెన్సియల్ కాలేజ్ ప్రవేశ పరీక్ష విధానం ఇతర ప్రవేశ పరీక్షల్లాగానే ఉంటుంది. ప్రశ్నాపత్రంలో మొత్తం మల్టిపుల్ ఛాయిస్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి.

  • ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి
  • పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు
  • 150 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. ఒక్కో సెక్షన్‌కి 50 మార్కులు కేటాయించడం జరుగుతుంది.
  • TSRJC CET 2023 ప్రశ్నా పత్రంలో పదో తరగతి సిలబస్ ఆధారంగా ప్రశ్నలు అడగడం జరుగుతుంది.
  • పరీక్ష ఆఫ్‌లైన్ మోడ్‌లో జరుగుతుంది.
  • ఎటువంటి నెగిటెవ్ మార్కింగ్ ఉండదు

పేపర్ గ్రూప్ (Paper Groups)

అభ్యర్థులు తప్పనిసరిగా ఈ కింది పేపర్ల సమూహాలలో ఒకదానికి హాజరు కావాల్సి ఉంటుంది.
కోడ్ సబ్జెక్ట్స్ గ్రూప్ మార్కులు
01 ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ 150
02 ఇంగ్లీష్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ 150
03 ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్ 150

టీఎస్ఆర్‌జేసీ 2023 ప్రిపరేషన్ టిప్స్ (TSRJC CET 2023 Preparation Tips)


TSRJC CET 2033 ఎగ్జామ్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఈ దిగువున సూచించే విధంగా ప్రిపరేషన్ టిప్స్‌ని ఫాలో అవ్వడం వల్ల మంచి ఫలితాలను సాధించవచ్చు.
  • TSRJC CET 2033 పరీక్షకు కనీసం 2, 3 నెలల ముందు ప్రిపరేషన్ ప్రారంభించాలి తద్వారా చివరి నిమిషంలో ఇబ్బంది ఉండదు.
  • టీఎస్ఆర్జేసీ 2023 పరీక్షకు కనీసం రెండు, మూడు నెలల ముందు ప్రిపరేషన్ ప్రారంభించాలి. తద్వారా చివరి నిమిషంలో ఇబ్బంది ఉండదు.
  • అభ్యర్థులు తాము ఏ టాపిక్‌‌పై బాగా పట్టు ఉందో? ఏ అంశంలో వీక్‌గా ఉన్నారో దృష్టిలో ఉంచుకుని దానికనుగుణంగా టైమ్ టేబుల్‌ని రూపొందించుకోవాలి
  • ప్రిపేర్ అయ్యే ముందు సిలబస్, పరీక్షా సరళి, పరీక్షకు సంబంధించిన ఇతర ముఖ్యమైన వివరాలను సరిగ్గా చెక్ చేసుకోవాలి.
  • పుస్తకాలు, ప్రశ్న, నమూనా పత్రాలు వంటి అన్ని అధ్యయన సామగ్రిని ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి.
  • మునుపటి సంవత్సరం ప్రశ్నపత్రం, నమూనా పత్రాలను వీలైనంత వరకు ప్రాక్టీస్ చేయాలి.
  • మీ బలహీనమైన పాయింట్లపై దృష్టి పెట్టి  దానిని మెరుగుపరచడానికి ప్రయత్నించాలి.
  • మ్యాథ్స్ పేపర్ గ్రూప్‌లో ఉన్నట్లయితే ప్రతిరోజూ గణిత సమ్మేళనాలను ప్రాక్టీస్ చేయాలి.
  • రివిజన్ చేసుకునే సమయంలో సహాయపడగల చక్కటి వ్యవస్థీకృత నోట్స్‌ని రాసుకోవాలి.
  • మంచి ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలి.
  • అదే సమయంలో మంచిగా నిద్రపోవాలి. మైండ్ ఫ్రెష్‌గా ఉండేలా బాగా నిద్రపోండి.
ఇది కూడా చదవండి: TSRJC CET 2033 హాల్ టికెట్ విడుదల ఎప్పుడంటే?

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/tsrjc-cet-2023-syllabus-and-exam-pattern/
View All Questions

Related Questions

Single subject se graduation

-Nikhil SinghUpdated on December 31, 2025 11:29 AM
  • 3 Answers
allysa , Student / Alumni

At Lovely Professional University (LPU), students can pursue single-subject graduation programs in various disciplines such as arts, science, and commerce. These programs focus on in-depth knowledge of one core subject, allowing students to specialize and build expertise in their chosen field. Admission is generally based on 10+2 marks or LPUNEST scores, and students can benefit from modern infrastructure, practical exposure, and career support to prepare for higher studies or professional opportunities.

READ MORE...

Does ncweb students can join hostel of kalindi college because I want to join college pls inform me if it can be possible Thank you

-shardhaUpdated on December 31, 2025 11:31 AM
  • 3 Answers
allysa , Student / Alumni

Lovely Professional University (LPU), located in Punjab, is one of India’s largest private universities offering a wide range of programs in engineering, management, law, sciences, and humanities. LPU focuses on practical learning, industry exposure, and skill development, with modern infrastructure, laboratories, and digital resources. The university encourages research, innovation, internships, and global collaborations, while its placement cell connects students with top companies, ensuring holistic academic and professional growth.

READ MORE...

Is there girls hostel available or what will be fee for hostel?

-AnshuUpdated on December 31, 2025 10:57 AM
  • 3 Answers
allysa , Student / Alumni

Yes, Lovely Professional University (LPU) provides separate hostels for girls with modern facilities including furnishing, Wi-Fi, security, and mess services. The hostel fees vary depending on the type of accommodation, generally ranging from ₹1.5 lakh to ₹2.5 lakh per year for a standard room with mess. LPU ensures a safe, comfortable, and inclusive environment for female students, with 24/7 security and dedicated staff support.

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Engineering Colleges in India

View All